
ఎండగాని నీడగాని యేమైనఁగాని – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎండగాని నీడగాని యేమైనఁగాని కొండలరాయఁడే మా కుల దైవము ॥చ1॥ తేలుగాని పాముగాని దేవపట్టయినఁగాని గాలిగాని ధూళిగాని కాని యేమైనా కాలకూటవిషమైన గక్కున మింగిన నాటి నీలవర్ణుఁడే మానిజ దైవము ॥చ2॥ చీమగాని దోమ గాని చెలఁది యేమైనఁగాని గాముగాని నాముగాని కాని యేమైనా పాములన్నిమింగే బలుతేజిపైనున్న ధూమకేతువే మాకు దొర దైవము ॥చ3॥ పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైనఁగాని కల్లగాని పొల్లగాని కాని యేమైనా బల్లిదుఁడై వేంకటాద్రిపైనున్నయాతఁడే మ- మ్మెల్లకాలమును నేలేయింటి దైవము |
రాగము: బౌళి రేకు: 0035-01 సంపుటము: 1-214 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి