ముఖ్యమంత్రిని కలిసేందుకు సతీష్ హామీ
కడప: సంఖ్యాపరంగా, పాఠశాలల పరంగా చూసినా కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం సాధనకు మేం శాయశక్తులా కృషిచేస్తాం, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి అన్నారు.
యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 20రోజుల నుంచి కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్న నిరాహార దీక్షాశిబిరాన్ని సందర్శించిన సతీష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారమే ఉర్దూ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలా ఉద్దీన్, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రిని ఈ విషయంపై కలుస్తామన్నారు. సతీష్‌రెడ్డిపైన ఉన్న నమ్మకంతో దీక్షలను విరమింపచేస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు సలాఉద్దీన్ ప్రకటించారు.