ఆదివారం , 22 డిసెంబర్ 2024
శివారెడ్డి

కడపజిల్లాపై ఉర్దూ ప్రభావం

క్రీ.శ.17 వ శతాబ్దం నుండి ఈ జిల్లాను మహమ్మదీయులు ఆక్రమించుకున్నారు. అప్పటినుంచి సిద్ధవటం, గండికోట, కడప ప్రాంతాలు ‘మయానా నవాబుల’ అధీనంలో ఉండేవి. వీరి పాలనా ప్రభావంవల్ల కొన్ని గ్రామనామాలు, వాడుక పదాలు ఉర్దూ భాషకు లోనైనాయి. ఇప్పటికీ ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వారి పేర్లే నిలిచిపోయాయి. ఉదాహరణకు ఖాజీపేట, ఇబ్రహీంపేట, సాలాబాద్‌. నేక్‌నామ్‌ఖాన్‌ పేరుమీద ఏర్పడిన నేక్‌నామాబాద్‌ ఇప్పటి కడప.

ఈ జిల్లాలో ‘మల్లయుద్ధం’ వంటి క్రీడల్ని నేర్చుకునే స్థలాలను ఇప్పటికీ ‘తాలెం కొట్టం’ అని పిలుస్తుంటారు. తాలింఖానా నుండి ఏర్పడిందే తాలెం కొట్టం.

ఏక్‌ దమ్మున – ‘ఏక్‌ దమ్మున అంత డబ్బు ఎక్కడ నుండి వస్తుంది’ అనే ప్రయోగం ఈ ప్రాంతంలో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ‘ఏక్‌ దమ్మున’ అంటే ‘ఉన్నట్లుండి, ఒక్కసారిగా’ అని అర్థం.

చదవండి :  కడప జిల్లాలో ఓట్ల పండగ మే 7న

లడాయి – ‘లడాయికి పోయి కొంపమీదకు తెచ్చుకున్నాడు’ అని ప్రయోగం. ‘గొప్పలకు పోయి కష్టాలు కొనితెచ్చుకున్నాడు’ అని అర్థం. లడాయి అంటే కొట్లాట, గొడవ అని అర్థం. తనను తాను గొప్పగా చెప్పుకునే సందర్భంలో ‘బడాయి’ అని వాడుక.

తకరారు – ‘వానితో పెద్ద తకరారుగా ఉంది’ అని ప్రయోగం ఉంది. ‘తకరారు’ అంటే ‘వాదులాట’ అని అర్థం.

బరాబర్‌ – ‘మొత్తం డబ్బును బరాబర్‌ గా పంచాలి’ అని ప్రయోగం. ‘బరాబర్‌’ అంటే ‘సరిసమానం’ అని అర్థం.

చదవండి :  కడప జిల్లాలో వీరశిలలు

జమాబంధి – ‘పది ఎకరాల జమాబంధి మొత్తం ఇచ్చాడా?’ అని ప్రయోగం. ‘జమాబంధి’అంటే ‘భూమి శిస్తు వసూలు చేయడం’ అని అర్థం.

అమల్‌ – అములు – అమలైంది గా మారింది

ఇనాం – మాన్యం అని అర్థం. (ఈ భూమి దేవుని ఇనాం అంటే దేవుని మాన్యం అని అర్థం)

ఇలాకా – సంబంధం ( నీవు ఎవరి ఇలాకా రా అబ్బీ? అని ప్రయోగం)

కస్బా – కసుబా – అంటే పెద్దస్థలం అని అర్థం.

కత్త్వ – కత్తువ – కట్టవ – ఆనకట్ట ( ఆనకట్టను ఈ ప్రాంతంలో కట్టవ అని పిలుస్తారు)

తహసీలుదారు – అమలుచేసేవాడు

చదవండి :  కాలజ్ఞాన మహిమలు - వి.వీరబ్రహ్మం

మౌజె – మవుంజె – ఊరు, పల్లె (కడపజిల్లా కరణాలు (వి.ఆర్‌.ఓ) లు మౌవుంజె పదాన్ని ఎక్కువగా వాడేవారు)

కర్బారు – కారుబారు – వ్యవసాయం (ఈ కారు ఏ పంట వేద్దాము అని ప్రయోగం అంటే ఈ దఫావేసే పంట అని అర్థం)

ముఖాసా – ముకాసా – జీవనానికి ఇచ్చే గ్రామం

– సి శివారెడ్డి

రచయిత గురించి

కడపలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో సహాయ పరిశోధకుడిగా పనిచేస్తున్న శివారెడ్డి వివిధ అంశాలకు సంబంధించి పలు సదస్సులలో పత్రాలు సమర్పించారు. వీరు రాసిన వ్యాసాలూ వివిధ పత్రికలలో అచ్చయినాయి. పెండ్లిమర్రి మండలంలోని ‘సోగలపల్లె’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: