
ఉన్నవిచారములేల వోవో సంసారులాల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఉన్నవిచారములేల వోవో సంసారులాల యిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో ॥చ1॥ తక్కక బ్రహ్మలఁగన్న తండ్రిఁ గొలిచి మీరు యెక్కువ సంతతిగల్గి యీడేరరో అక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి మీరు చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో ॥చ2॥ భవరోగవైద్యుని పాదములు సేవించి భువి రోగములఁ బాసి పొదలరో తవిలి పదిదిక్కులు తానైన వానిఁ గవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో ॥చ3॥ తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడే యెల్లగాఁ బుట్టించి పెంచేయేలి కీతఁడే చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో |
రాగము: సాళంగం రేకు: 0090-01 సంపుటము: 1-441 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగం