ఈ సురలీ మునులీ చరాచరములు

॥పల్లవి॥
ఈ సురలీ మునులీ చరాచరములు
యీ సకలమంతయు నిది యెవ్వరు
॥చ1॥
ఎన్నిక నామము లిటు నీవైయుండఁగ
యిన్నినామముల వారిది యెవ్వరు
వున్నచోటనే నీవు వుండుచుండఁగ మరి
యిన్నిటాఁ దిరుగు వారిది యెవ్వరు
॥చ2॥
వొక్కరూపై నీవు వుండుచుండఁగ మరి
తక్కిన యీరూపములు తా మెవ్వరు
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ
మక్కువ నుండువారు మరి యెవ్వరు
॥చ3॥
శ్రీవేంకటాద్రిపై చెలఁగి నీవుండఁగా
దైవంబులనువారు తా మెవ్వరు
కావలిసినచోట కలిగి నీ వుండఁగ
యీవిశ్వపరిపూర్ణు లిది యెవ్వరు
రాగము: నాదరామక్రియ
రేకు: 0015-05
సంపుటము: 1-93

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాదరామక్రియ

చదవండి :  తలఁపు కామాతురత్వముమీఁదనలవడిన-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: