ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది – అన్నమయ్య సంకీర్తన

ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది
పావనుల హృదయమునఁ బ్రభవించుఁగానిని
॥చ1॥
ఇమ్మయినపాపంబు లెన్నివలసినఁ బ్రాణి
సమ్మతంబున జేయఁ జాలుఁగా కేమి
కుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవును
నమ్మితలఁ చినవిష్ణునామంబుచేత
॥చ2॥
కొదలేనిదురితములు కొండలునుఁ గోట్లును
చెదర కెప్పుడుఁ బ్రాణి చేయుగా కేమి
పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను
హృదయంబు హరిమీఁద నుండినంతటను
॥చ3॥
సరిలేని దుష్కర్మసంఘములు రాసులై
పెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁగాకేమి?
బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లౌను
తిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను
రాగము: శ్రీరాగం
రేకు: 0010-04
సంపుటము: 1-64

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  గాలినే పోయఁ గలకాలము - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: