swimming pool

అంతర్జాతీయ ప్రమాణాలతో ఈతకొలను: మేయర్

కడప: భవిష్యత్‌లో కడప జిల్లా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో ఈత పోటీలు నిర్వహించడానికి వీలుగా అన్ని సదుపాయాలతో కూడిన ఈతకొలనును వైఎస్సార్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ట్టు నగర మేయర్‌ కె. సురేష్‌బాబు, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీఆర్‌ఐ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈతకొలను నిర్మాణ పనులు చేపట్టడానికి సోమవారం ఉదయం ఇండోర్‌ స్టేడియం ప్రాంగణలో భూమి పూజ చేపట్టనున్నారు. ఇందుకు సంబందించి ఆదివారం మేయర్‌ సురేష్‌బాబు, సీఆర్‌ఐ సుబ్బారెడ్డి, డీఎస్‌డీఓ బాషామొహిద్దీన్‌, ఎన్‌ఆర్‌ఐ ట్రస్టు చైర్మన్‌ తోటక్రిష్ణ అవసరమైన భూమిని, మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకే తలమానికంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్‌పూల్‌ నిర్మాణం చేస్తామన్నారు.

చదవండి :  రేపు కడపకు జగన్

మెరుగైన మౌలిక సదుపాయాల

ఇండోర్‌ స్టేడియం ప్రాంగణంలో కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మేయర్‌, సీఆర్‌ఐ, డీఎస్‌డీవోలు తెలిపారు. ఇండోర్‌ స్టేడియంలో నిత్యం వందలాది మంది విచ్చే సి బ్యాడ్మింటన్‌ సాధన చేస్తున్నారన్నారు. వ్యాయామం కోసం అన్ని సదుపాయాలతో కూడిన జిమ్‌ కూడా అందుబాటులో ఉంటుందన్నారు.

స్పోర్ట్సు అథారిటీ మైదానంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో వందలాది మంది వాకర్లు వస్తుంటారన్నారు. వీరందరికీ ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి స్కేటింగ్‌ కోర్టు, ఈతకొలను నిర్మాణాల మధ్య చక్కటి తోటను ఏర్పాటు చేస్తామన్నారు. ఇండోర్‌ ప్రాంగణంలో ప్రవేశించి తక్షణమే వారికి క్రీడలను ఆహ్వానించదగ్గ వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. క్రీడాకారులకు, క్రీడాభిమానులకు ఇతరులకు అవసరమైన అల్పాహారాలను ఏర్పాటు చేస్తామన్నారు.

చదవండి :  ఒంటిమిట్టలో టీవీ సినిమా చిత్రీకరణ

కార్పొరేట్‌ స్థాయిలో రుచికరమైన టీ, కాఫీలు, స్నాక్స్‌, ఫలహారాలు, శీతలపానీయాలు ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌ పూల్‌ పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కమిటీ లక్ష్యమన్నారు. మార్చి చివరి లోపు నిర్మాణాలు పనులు పూర్తి చేస్తామన్నారు.

మొత్తానికి కార్పోరేట్ స్థాయి అని చెప్పి ఇండోర్ స్టేడియాన్ని కార్పొరేట్ల పరం చేయరు కదా!

ఇదీ చదవండి!

బుగ్గవంక

బుగ్గవంక రిజర్వాయర్ సొగసు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: