
ఇరవగువారికి యిహపర మిదియే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇరవగువారికి యిహపర మిదియే హరిసేవే సర్వాత్మలకు ॥చ1॥ దురితమోచనము దుఃఖపరిహరము హరినామమెపో ఆత్మలకు పరమపదంబును భవనిరుహరణము పరమాత్ముచింతే ప్రపన్నులకు ॥చ2॥ సారము ధనములు సంతోషకరములు శౌరికథలు సంసారులకు కోరినకోర్కియు కొంగుబంగరువు సారె విష్ణుదాస్యము లోకులకు ॥చ3॥ యిచ్చయగుసుఖము యిరవగుపట్టము అచ్చుతుకృప మోక్షార్థులకు అచ్చపు శ్రీవేంకటాధిపు శరణము రచ్చల మాపాలిరాజ్యపు సుగతి |
రాగము: లలిత రేకు: 0089-05 సంపుటము: 1-439 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత