
ఇన్ని లాగులచేతు లివియపో కడు-
॥పల్లవి॥ ఇన్ని లాగులచేతు లివియపో కడు- నెన్నిక కెక్కినచేతు లివియపో ॥చ1॥ గునియుచుఁ దనునెత్తుకొమ్మని తల్లిపై- నెనయఁ జాఁచినచేతు లివియపో కినిసి గొవర్ధనగిరి వెల్లగించిన- యునుమువంటి చేతు లివియపో ॥చ2॥ పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన- యిసుమంతలు చేతు లివియపో పసులఁ గాచుచు గొల్లపడుచుల యమునలో యిసుక చల్లినచేతు లివియపో ॥చ3॥ పరమచైతన్యమై ప్రాణుల కెల్లను యెరవులిచ్చినచేతు లివియపో తిరువేంకటగిరి దేవుఁడై ముక్తికి- నిరవు చూపెడుచేతు లివియపో |
రాగము: ఆహిరి రేకు: 0027-05 సంపుటము: 1-166 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరి