
ఇన్ని నేఁతలకు నిది యొకటే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇన్ని నేఁతలకు నిది యొకటే కన్నా మన సిది కానదు గాని ॥చ1॥ పాతకకోట్లు భవములు భస్మీ- భూతముసేయఁగఁ బొడవొకటే శ్రీతరుణీపతిచింత, నిజముగా యేతరి చిత్తం బెఱఁగదుగాని ॥చ2॥ మరణభయంబులు మదములు మలినీ- కరణము సేయఁగఁగల దొకటే హరినామామృత , మందుమీఁది రతి నిరతము నా కిది నిలువదుగాని ॥చ3॥ కుతిలములును దుర్గుణములునుఁ దృణీ – కృతములు సేయఁగ గురుతొకటే పరియగువేంకటపతి సేవారతి, గతియని మతి గని కానదుగాని |
రాగము: దేవగాంధారి రేకు: 0046-06 సంపుటము: 1-285 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి