ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ – అన్నమయ్య సంకీర్తన

ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ
జెన్నలర హరిసేవ సిద్దించుకొరకు
॥చ1॥
అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్దికొర-
కిరవైనశాస్త్రంబు లెరుకకొరకు
తరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకు
సరిలేనిదానములు జన్మములకొరకు
॥చ2॥
మమకారదూరంబు మనసు గెలుచుటకొరకు
సమవివేకంబు శాంతములకొరకు
అమరశ్రీతిరువేంకటాధ్రీశుమనసు నీ-
జముగెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు
రాగము: నాదరామక్రియ
రేకు: 0005-05
సంపుటము: 1-34

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాదరామక్రియ

చదవండి :  నీవేకానింక నే నన్య మెఱఁగ యే- - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: