
ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే వున్నవారియీవులెల్ల నొద్దికయ్యీనా read ॥చ1॥ తెగనియాపదలకు దేవుఁడే కలఁడుగాక వగలుడుపఁ బరులవస మయ్యీనా నొగిలి యితరలకు నోళ్ళుదెరచిన నగుఁబాటేకాక మానఁగఁబొయ్యీనా ॥చ2॥ అగ్గలపుదురితాలు హరియే మానుపుఁగాక బగ్గన నొక్కరు వచ్చి పాపఁబొయ్యేరా తగ్గుముగ్గులైనవేళ తలఁచినవారెల్ల సిగ్గుఁబాటేకాక తమ్ముఁ జేరవచ్చేరా ॥చ3॥ యెట్టు నేసినను వేంకటేశుఁడే నేరుచుఁగాక కట్టఁగడవారెల్లఁ గరుణించేరా యిట్టే యేమడిగిన నీతఁడే యొసఁగుఁగాక వుట్టిపడి యెవ్వరైనా నూరడించేరా |
రాగము: శంకరాభరణం రేకు: 0034-03 సంపుటము: 1-210 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం