
ఇదివో సంసారమెంత సుఖమో కాని – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తొడవు గడియించె ॥చ1॥ పంచేద్రియంబులను పాతకులు దనుఁదెచ్చి కొంచెపు సుఖంబునకుఁ గూర్పఁగాను మించి కామంబనేడిమేఁటి తనయుండు జని- యించి దురితధనమెల్ల గడియించె ॥చ2॥ పాయమనియెడి మహపాతకుఁడు తనుఁ దెచ్చి మాయంపు సుఖమునకు మరుపఁగాను సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ బోయి యీనరకమనుపురము గడియించె ॥చ3॥ అతియుండగువేంకటాద్రీశుఁడను మహ- హితుఁడు చిత్తములోన నెనయఁగాను మతిలోపల విరక్తిమగువ జనియించి య- ప్రతియయి మోక్షసంపదలు గడియించె |
రాగము: శ్రీరాగం రేకు: 0050-05 సంపుటము: 1-308 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం