
ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణమోహవిరహితు లెఱుగుఁదురు నినునిందిరారమణా ॥చ1॥ నారీకటాక్షపటు నారాచభయరహిత- శూరులెఱుఁగుదురు నినుఁ చూచేటి చూపు ఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు- ధీరులెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము ॥చ2॥ రాగభోగవిదూర రంజితాత్ములు మహా- భాగు లెరుఁగుదురు నినుఁ బ్రణుతించువిధము ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా- యోగులెఱుఁగుదురు నీవుండేటివునికి ॥చ3॥ పరమభాగవత పదపద్మసేవానిజా- భరణులెఱుఁగుదురు నీ పలికేటిపలుకు పరగు నిత్యానంద పరిపూర్ణ మానస- స్థిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ |
రాగము: శ్రీరాగం రేకు: 0041-04 సంపుటము: 1-252 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం