గురువారం , 21 నవంబర్ 2024
ఇందులోనే కానవద్దా

ఇందులోనే కానవద్దా – అన్నమయ్య సంకీర్తన

అన్నమయ్య సంకీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముడు

ఒంటిమిట్టలోని కోదండరాముడ్ని దర్శించి తరించిన పదకవితా పితామహుడు ఆయన సాహస గాధల్ని (అలౌకిక మహిమల్ని)ఇట్లా కీర్తిస్తున్నాడు …

వర్గం: ఆధ్యాత్మ సంకీర్తన
రాగము: నాట
రేకు: 0096-01
సంపుటము: 1-477

ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని
విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని

యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు
కందువ రాఘవుఁడు ఖండించునాఁడు
ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే
గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు ||ఇందులోనే||

చదవండి :  మార్చి 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి
వేడుకతో హరివిల్లు విఱిచేనాఁడు
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు
కూడ బట్టి సంజీవికొండ దెచ్చేనాఁడు ||ఇందులోనే||

జముఁ డెక్కడికిఁ బోయ సరయువులో మోక్ష-
మమర జీవుల కిచ్చె నల్లనాఁడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి
తిమిరి శ్రీవేంకటపతికి నేఁడు నాఁడు ||ఇందులోనే||

భావం :

ఒంటిమిట్టలో నెలవైన ఓ వీరరాఘవా విందైన నీ దర్శనమే నీవు దైవమని చెప్పుటకు చాలదా! నీ చేత చంపబడిన రావణుడికి చావు లేకుండా బ్రహ్మ ఇచ్చిన  వరాలేమయినాయి? ఇతరులకు లేని శివుని విల్లు విరిచిన మహిమ నీకు ఎట్లా వచ్చింది? నీ బంటు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చినపుడు ఇంద్రుడు మొదలైనవారు ఓడక ఏడ దాక్కున్నారు? సరయూ నదీ తీరాన నీవు అమరులకు మోక్షమిచ్ఛేతప్పుడు యముడు ఎక్కడికి పోయినాడు?  రామావతారంలోనైనా వేంకటేశుని అర్చావతారం నాడైనా ఈ దేవతలు వానరులై నీకు బంటులైనారు.

చదవండి :  ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ

ఇదీ చదవండి!

సొంపుల నీ

సొంపుల నీ వదనపు సోమశిల కనుమ – అన్నమయ్య సంకీర్తన

వర్గం : శృంగార సంకీర్తనలు ॥పల్లవి॥ సొంపుల నీ వదనపు సోమశిల కనుమ యింపులెల్లఁ జేకొనఁగ నిల్లు నీపతికి ॥చ1॥ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: