
ఇందునుండ మీ కెడ లేదు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇందునుండ మీ కెడ లేదు సందడి నేయక చనరో మీరు read ॥చ1॥ నాలుక శ్రీహరినామం బున్నది తూలుచుఁ బారరొ దురితములు చాలి భజంబున చక్రం బున్నది తాలిమి భవబంధము లటు దలరో ॥చ2॥ అంతర్యామై హరి వున్నాఁ డిదె చింతలు వాయరొ చిత్తమున వింతలఁ జెవులను విష్ణుకథ లివిగొ పొంతఁ గర్మములు పోరో మీరు ॥చ3॥ కాపయి శ్రీవేంకటపతిపే రిదె నాపై నున్నది నయమునను కోపపుకామాదిగుణములాల మీ- రేపున కడఁగడ నెందైన బోరో |
రాగము: పాడి రేకు: 0078-06 సంపుటము: 1-375 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి