
ఇందిరాపతిమాయలు యింతులు సుండీ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇందిరాపతిమాయలు యింతులు సుండీ మందలించి హరి గొల్చి మనుదురుగాని ॥చ1॥ అతివలచూపులే ఆయాలు దాఁకీఁ జుండీ జితమైనపులకల జిల్లులౌఁజుండీ రతిపరవశములు రాఁగినమూర్ఛలు సుండీ మతిలోఁ దప్పించుక మనుదురుగాని ॥చ2॥ మెఱయించేచన్నులే మించుఁబెట్లుగుండ్లు సుండీ మెఱుఁగువమోవులే మచ్చు మేపులు సుండీ మఱి మంచిమాటలు మాయపుటురులు సుండీ మఱవక తప్పించుక మనుదురుగాని ॥చ3॥ బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీ వెలలేనివలపులు విషము సుండీ యెలమితో శ్రీవేంకటేశ్వరుమఱఁగు చొచ్చి మలయుచు సొలయుచు మనుదుచుగాని |
రాగము: ముఖారి రేకు: 0098-06 సంపుటము: 1-494 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి