
ఇందిరానామ మిందరికి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇందిరానామ మిందరికి కుందనపుముద్ద వో గోవింద is-aber.net ॥చ1॥ అచ్చుతనామము అనంతనామము ఇచ్చినసంపద లిందరికి నచ్చినసిరులు నాలుకతుదలు కొచ్చికొచ్చీ నోగోవిందా ॥చ2॥ వైకుంఠనామము వరదనామము ఈకడనాకడ నిందరికి వాకుఁదెరపులు వన్నెలు లోకాలఁ గూకులు వత్తులు నోగోవిందా ॥చ3॥ పండరినామము పరమనామము ఎండలువాపెడి దిందరికి నిండునిధానమై నిలచినపేరు కొండలకోనేటివోగోవిందా |
రాగము: శుద్ధవసంతం రేకు: 0002-02 సంపుటము: 1-8 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్ధవసంతం