
ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాక – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాక బొందితోడిజీవులకు బుద్దు లేఁటిబుద్దులు ॥చ1॥ రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియు బాయట నిద్రాదేవి పలుమారును చాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటి- మాయజీవులకునెల్లా మని కేఁటిమనికి ॥చ2॥ కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీఁకటౌను కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె యెనయుజీవుల కింక యెఱు కేఁటియెఱుక ॥చ3॥ వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట యెప్పుడు లోనివెలికి నెడతాఁకును అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు |
రాగము: సామంతం రేకు: 0088-06 సంపుటము: 1-434 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం