
ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో సంతపాకలంజఁ దెచ్చి సన్యాసిఁ జేసె ॥చ1॥ పరిగెలేరేటివానిఁ బట్టపురాజుఁగా నిరతభోగము లిచ్చి నిలిపినట్లు ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు అరయ నిత్తడిఁ దెచ్చి యపరంజిఁ జేసె ॥చ2॥ కుక్కలవండుకతినే కులహీనునిఁ దెచ్చి వెక్కసఁబాఁపనిఁ గావించినయట్లు దిక్కులెఱఁగఁగఁ గష్టదేహిని నన్నుఁ దెచ్చి గక్కనఁ దెలుకపిండి కస్తూరి సేనె ॥చ3॥ చెడుగైనదోమఁ దెచ్చి సింహపుఁగొదమఁగా బెడిదంపుఁ బ్రేమతోడఁ బెంచినయట్లు కడునధముని వేంకటపతి నను నిటు చిడిపిరాయి దెచ్చి చింతామణి సేనె |
రాగము: కన్నడగౌళ రేకు: 0046-03 సంపుటము: 1-282 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ