
ఆసమీఁద విసుపౌ దాఁక యీ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఆసమీఁద విసుపౌ దాఁక యీ గాసిఁ బరచుతన కపటమే సుఖము ॥చ1॥ తిరమగుఁ కర్మము దెగుదాఁక తన- గరిమ సుఖము పొగడునందాఁక పరమార్గం బగపడుదాఁక తన- పరితాపపు లంపటమే సుఖము ॥చ2॥ కాయము గడపల గనుదాఁక యీ మాయ దన్ను వెడమరుదాఁక రాయడి మదము గరఁగుదాఁక యీ- రోయఁదగిన తనరూపమే సుఖము ॥చ3॥ లంకెలఁ బొరలి నలఁగుదాఁక యీ యంకెల భవము లెరవౌదాఁక వేంకటపతిఁ దడవిన దాఁక యీ కింకురువాణపు గెలుపే సుఖము |
రాగము: ఆహిరి రేకు: 0034-05 సంపుటము: 1-212 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి