ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు – అన్నమయ్య సంకీర్తన

ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు
దూపలి తలఁచినా దోషహరము
॥చ1॥
గరుడనినెక్కినఘనరేవంతుఁడు
గరుడ కేతనముగలరథుఁడు
గరుడఁడే తనకును గరియగుబాణము
గరిమె నీతఁడేపో ఘనగారుడము
॥చ2॥
పాముపరపుపై బండినసిద్ధుడు
పాముపాశముల పరిహరము
పామున నమృతముఁ పడఁదచ్చినతఁడు
వేమరు నీతఁడే విషహరము
॥చ3॥
కమలాక్షుఁ డీతఁడు కమలనాభుఁడును
కమలాదేవికిఁ గైవశము
అమరిన శ్రీవేంకటాధిపు డితఁడే
మమతల మాకిదే మంత్రౌషధము
రాగము: సామంతం
రేకు: 0089-04
సంపుటము: 1-438

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  దేహ యీతగవు దీర్చవయ్యా - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: