
ఆదిమునుల సిద్ధాంజనము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఆదిమునుల సిద్ధాంజనము యేదెసఁ జూచిన నిదివో వీఁడే ॥చ1॥ నగిన సెలవిఁ బడు నాలుగుజగములు మొగమునఁ జూపే మోహనము నిగిడి యశోదకు నిధానంబై పొగడొందీ గృహమున నిదె వీఁడే ॥చ2॥ కనుదెరచిన నలుగడ నమృతము లటు అనువునఁ గురసీ నపారము వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ మనికికి నిరవై మలసీ వీఁడే ॥చ3॥ పరమునకునుఁ దాఁ బరమై వెలసిన- పరిపూర్ణ పరాత్పరుఁడు సరుస రుక్మిణికి సత్యభామకును వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే |
రాగము: ధన్నాశి రేకు: 0043-01 సంపుటము: 1-261 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ధన్నాశి