
ఆదిదేవుఁడై అందరిపాలిటి
॥పల్లవి॥ ఆదిదేవుఁడై అందరిపాలిటి కీ దేవుఁడై వచ్చె నితఁడు is-aber.net ॥చ1॥ కోరిన పరమ యోగుల చిత్తములలోన యేరీతి నుండెనో యీతఁడు చేరవచ్చిన యాశ్రితులనెల్లఁ బ్రోవ యీరీతి నున్న వాఁడీతడు ॥చ2॥ కుటిల దానవుల కోటానఁగోట్ల యెటువలెఁ ద్రుంచెనో యీతఁడు ఘటియించి యిటువంటి కారుణ్యరూపుఁడై యిటువలె నున్న వాఁడీతడు ॥చ3॥ తక్కక్క బ్రహ్మాండ తతులెల్ల మోచితా- నెక్కడ నుండెనో యీతఁడు దిక్కుల వెలసిన తిరువేంకటేశుఁడై యిక్కడ నున్న వాఁడీతఁడు |
రాగము: సామంతం రేకు: 0021-03 సంపుటము: 1-127 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం