
ఆదిదేవుఁడనఁగ మొదలు నవతరించి జలది సొచ్చి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఆదిదేవుఁడనఁగ మొదలు నవతరించి జలది సొచ్చి వేదములును శాస్త్రములును వెదకి తెచ్చె నీతఁడు ॥చ1॥ వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల మూలమూలఁ ద్రోసి ముసుఁగుపాలు సేసె నీతఁడు వేలంఖ్యలైనసతుల వేడుకలలరఁజేసి వొంటి నాలిమగనిరీతిఁ గూడి యనభవించె నీతఁడు ॥చ2॥ కడుపులోని జగములెల్లఁ గదలకుండఁ బాఁపరేని- పడుక నొక్కమనసుతోడఁ బవ్వళించె నీతఁడు అడుగుకింద లోకమెల్ల నడఁచఁదలఁచి గుఱుతుమీర పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చె నీతఁడు ॥చ3॥ కోడెవయసునాఁడు మంచి గోపసతుల మనములెల్ల ఆడి కెలకు నోప కొల్లలాడి బ్రదికె నీతఁడు వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుఁ జూడుఁడనుచు మోక్షపదము చూరవిడిచె నీతఁడు |
రాగము: కాంబోది రేకు: 0063-03 సంపుటము: 1-324 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కాంబోది