అలర నుతించరో హరిని – అన్నమయ్య సంకీర్తన

అలర నుతించరో హరిని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అలర నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము
॥చ1॥
సేయరో మనుజులార చింత హరినిఁకనైన
రోయరో మీభుజియించు రుచులమీఁద
కాయ మస్థిరము యీకలి మధ్రువము చాలఁ
బోయఁబో యెందుకుఁగాకపోయఁ గాలము
॥చ2॥
మెచ్చరో మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-
నిచ్చీని శుభములు యివి యెల్లకాలము
॥చ3॥
కనరో వేంకటపతిఁ గన్నులుదనియఁగా
వినరో యీతనిస్తుతి వీనులు నిండ
మనరో శ్రీహరిచేతిమన్ననలు మీరు
తనమీఁదిమది బుద్ధి దాఁచీనిఁ గాలము
రాగము: భూపాళం
రేకు: 0065-05
సంపుటము: 1-338

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భూపాళం

చదవండి :  కుడుచుఁగాక తనకొలఁదిగాని మేలు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: