అరిది నేఁతలే చేసి తల్లాడ నిల్లాడ – అన్నమయ్య సంకీర్తన

అరిది నేఁతలే చేసి తల్లాడ నిల్లాడ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అరిది నేఁతలే చేసి తల్లాడ నిల్లాడ
సరిలేక వుండితివి జలరాశికాడ
॥చ1॥
పొలియఁ బీర్చితి వొకతిఁ బురిఁటి మంచముకాడ
నలఁచితి వొకని గగనంబుకాడ
బలిమిఁ దన్నితి వొకని బండిపోతులకాడఁ
దులిమితివి యేడుగురఁ దోలి మందకాడ
॥చ2॥
తడవి మోదితి వొకని తాటిమాఁకులకాడ…
నడిచితివి వొకనిఁ బేయలకాడను
పిడిచివేసితి వొకని బృందావనముకాడ
వొడిసితివి వొకని నావులమందకాడ
॥చ3॥
పటపటన దిక్కులు పగుల బగతులఁ దునిమి
నటియించితివి మామనగరికాడ
కుటిలబహుదైత్యాంతకుఁడవు వేంకటరాయ
పుటమెగసితి జగంబులయింటికాడ
రాగము: ముఖారి
రేకు: 0048-02
సంపుటము: 1-294

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  ఎండగాని నీడగాని యేమైనఁగాని - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: