
అమ్మెడి దొకటి అసిమలోదొకటి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అమ్మెడి దొకటి అసిమలోదొకటి బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా ॥చ1॥ సంగము మానక శాంతియుఁ గలుగదు సంగలంపటము సంసారము యెంగిలిదేహం బింతకు మూలము బెంగల మిందేఁటి పెద్దలమయ్యా ॥చ2॥ కోరికె లుడుగక కోపం బుడుగదు కోరకుండ దిక్కువ మనసు క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు పేరడి నేమిటి పెద్దలమయ్యా ॥చ3॥ ఫలము లందితే బంధము వీడదు ఫలముతో తగులు ప్రపంచము యిలలో శ్రీవేంకటేశు దాసులము పిలువఁగ నేమిటి పెద్దలమయ్యా |
రాగము: లలిత రేకు: 0097-01 సంపుటము: 1-483 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత