కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆచార్య డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిని పలువురు ఆదివారం సన్మానించి అభినందనలు తెలిపారు. సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం పూర్వ బాధ్యులు విద్వాన్ కట్టా నరసింహులు, యోవేవి లలిత కళల విభాగం సహాయాచార్యులు డా.మూల మల్లికార్జునరెడ్డి, సిబ్బంది శివారెడ్డి, భూతపురి గోపాలకృష్ణ, హరిభూషణ్ రావు, రమేష్, వెంకటరమణ తదితరులు అభినందించారు.
రచయిత డా.వేంపల్లి గంగాధర్ శాలువా, పూలమాలతో రాచపాళెంను సత్కరించారు. రచయిత మధు, కొండూరు జనార్థనరాజు, జిల్లా సాహితీ స్రవంతి కన్వీనర్ మస్తాన్ వలి, డీఎస్పీ లోసారి సుధాకర్, ఇతర పోలీసు అధికారులు ఆయన్ని కలిసి అభినందనలు తెలియచేశారు.