
అభయమభయమో హరి నీకు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అభయమభయమో హరి నీకు విభుఁడ వింతటికి వెర విఁక నేది ॥చ1॥ జడిగొని మదిలో శాంతము నిలువదు కడుఁగడు దుస్సంగతి వలన యిడుమలేని సుఖ మించుక గానము అడియాసల నా యలమటవలన ॥చ2॥ తలఁపులోన నీతత్వము నిలువదు పలు లంపటముల భ్రమవలన కలిగిన విజ్ఞాన గతియును దాఁగెను వెలి విషయపు పిరివీకుల వలన ॥చ3॥ పక్కనఁ బాపపు బంధము లూడెను చిక్కక నినుఁ దలఁచిన వలన చిక్కులు వాసెను శ్రీవేంకటపతి నిక్కము నా కిదె నీకృప వలన |
రాగము: పాడి రేకు: 0080-02 సంపుటము: 1-383 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి