అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి – అన్నమయ్య సంకీర్తన

అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి
కప్పినదియుఁ గప్పనిదియుఁ గనుఁగొనఁగలనాఁడు
॥చ1॥
ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పినినాఁడు
పాపములకు పుణ్యములకుఁ బనిదొలఁగిననాఁడు
కోపములకు శాంతములకుఁ గూటమి మానిననాఁడు
లోపల వెలుపల తనమతిలోఁ దెలిసిననాఁడు
॥చ2॥
తనవారలఁ బెరవారలఁ దాఁ దెలిసిననాఁడు
మనసునఁ జైతన్యంబున మఱపందిననాఁడు
పనివడి తిరువేంకటగిరిపతి నీదాసులదాసులఁ
గనుఁగొని నీభావముగాఁ గనువిచ్చిననాఁడు
రాగము: లలిత
రేకు: 0006-07
సంపుటము: 1-43

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత

చదవండి :  నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: