
అన్ని చోట్లఁ పరమాత్మ నీవు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అన్ని చోట్లఁ పరమాత్మ నీవు యిన్నిరూపుల భ్రమయింతువుగా ॥చ1॥ పాలజలనిధినుండి బదరీవనాన నుండి ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి భూలోకనిధివై పురుషోత్తమాన నుండి వేలసంఖ్యలరూపై విచ్చేతుగా ॥చ2॥ వుత్తర మధురలో నయోధ్య లోపలినుండి సత్తైన నందవ్రజాన నుండి చిత్తగించి పంచవటి సింహాద్రిలోననుండి వత్తుగా లోకములు పావనము సేయఁగను ॥చ3॥ కైవల్యముననుండి కమలజలోకాన మోవఁగ శ్రీరంగమున నుండి యీవల నావల నుండి యీవేంకటాద్రిపై నీవే నీవే వచ్చి నెలకొంటిగా |
రాగము: ముఖారి రేకు: 0045-06 సంపుటము: 1-278 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి