
అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు పన్నినలోకులకెల్ల ప్రకృతి కారణము ॥చ1॥ తలఁపు గారణము తత్వవేత్తలకును చలము గారణము సంసారులకును ఫలము గారణము పరమవేదాంతులకు కలిమి గారణము కర్ములకును ॥చ2॥ తనయాత్మ గారణము తగినసుజ్ఞానులకు తనువే కారణము తగ జంతువులకు ఘనము క్తి గారణము కడగన్నవారికెల్లా కనకమే కారణము కమ్మినబంధులకు ॥చ3॥ దేవుఁడు గారణము తెలిసినవారికెల్లా జీవుడు గారణము చిల్లరమనుజులకు దేవుడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడే పావన మాతనికృప పరమకారణము |
రాగము: దేసాళం రేకు: 0094-06 సంపుటము: 1-470 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాళం