అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా – అన్నమయ్య సంకీర్తన

అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
వన్నెల నప్పులుగొన్నవారువో వీరు
read
॥చ1॥
తెగనీక అప్పులెల్లాఁ దీసితీసి | వారు
తగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగి
వెగటునఁ బారిపోఁగా వెంట వెంట | పెక్కు
పగల నప్పులుగొన్న వారువో వీరు
॥చ2॥
సేయరానిపనులెల్లఁ జేసిచేసి | తవ-
రాయడికి లోలోనే రాసిరాసి
కాయములోచొచ్చిచొచ్చి కాఁచికాఁచి | మున్ను
వ్రాయనిపత్రాల కాఁగేవారువో వీరు
॥చ3॥
దొరయై యప్పులవారిఁ దోసితోసి | యీ-
పరిభవములనెల్లఁ బాసిపాసి
సిరులవేంకటపతిఁ జేరిచేరి | యిట్టి …
వరుసనే గెలిచినవారువో వీరు
రాగము: వరాళి
రేకు: 0036-05
సంపుటము: 1-224

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళి

చదవండి :  ఏమి గలదిందు నెంత గాలంబైన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *