అనుమానపుబ్రదు కది రోఁతా తన
॥పల్లవి॥ అనుమానపుబ్రదు కది రోఁతా తన మనసెనయనికూటమి మరి రోఁతా arcoxia arcoxia 120 ॥చ1॥ అపకీర్తులఁబడి ఆడికెలోనై అపవాదియౌట అదిరోఁత వుపమ గెలిచేనని వొరుఁ జెరుచుటలు విపరీతపుగుణవిధ మొకరోఁతా ॥చ2॥ తనగుట్టెల్లా నెరిఁగినవారలముందట తనయెమ్మెలు చెప్పుకొనుట రోఁత వనితలముందట వదరుచు వదరుచు కనుఁగవ గాననిగర్వము రోఁత ॥చ3॥ భువి హరి గతియని బుద్ధిఁదలంచని- యవమానపుమన నది రోఁత భవసంహరుఁడై పరగువేంకటపతి- నవిరళముగఁ గొలువని దది రోఁత |
రాగము: ముఖారి రేకు: 0004-06 సంపుటము: 1-26 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి