అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని – అన్నమయ్య సంకీర్తన

అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని
వెదకివెదకి తిరువీధులందు దేవుఁడు
॥చ1॥
అలసూర్యవీధి నేఁగీ నాదిత్యునితేరిమీద
కలికికమలానందకరుఁడుగాన
తలపోసి అదియును దవ్వు చుట్టఱికమని
యిలఁ దేరిమీఁద నేఁగీ నిందిరావిభుఁడు
॥చ2॥
చక్క సోమవీధి నేఁగీ జందురునితేరిమీఁద
యెక్కువైన కువలయహితఁడుగాక
చుక్కలు మోచిన దవ్వుచుట్టరిక మిదియని
యిక్కువతో వీధి నేఁగీ నెన్నికైన దేవుఁడు
॥చ3॥
యింతులమనోవీధి నేఁగీ మరుతేరిమీఁద-
నంతటా రతిప్రియుఁ డటుగాన
రంతుల నదియుఁ గానరానిచుట్టరికమని
వింతరీతి నేఁగీ శ్రీవేంకటాద్రిదేవుఁడు
రాగము: శంకరాభరణం
రేకు: 0087-02
సంపుటము: 1-424

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం

చదవండి :  సకలసంగ్రహము సకలసంచయము - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: