
అణురేణు పరిపూర్ణుఁడైన శ్రీవల్లభుని – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అణురేణు పరిపూర్ణుఁడైన శ్రీవల్లభుని బ్రణుతించువారువో బ్రాహ్మలు ॥చ1॥ హరి నామములనె సంధ్యాది విధులొనరించు పరిపూర్ణమతులు వో బ్రాహ్మలు హరి మంత్ర వేద పారాయణులు హరి భక్తి పరులైన వారువో బ్రాహ్మలు ॥చ2॥ యేమి చూచినను హరి యిన్నిటాఁ గలఁడనుచు భావించువారువో బ్రాహ్మలు దేవకీనందనుఁడె దేవుఁడని మతిఁదెలియు పావనులు వారువో బ్రాహ్మలు ॥చ3॥ ఆదినారాయణుని ననయంబుఁ దమయాత్మఁ బాదుకొలిపిన వారు బ్రాహ్మలు వేద రక్షకుఁడైన వేంకట గిరీశ్వరుని పాద సేవకులవో బ్రాహ్మలు |
రాగము: శ్రీరాగం రేకు: 0070-02 సంపుటము: 1-365 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం