కడప జిల్లాలో ఉన్న అరుదైన ఆలయాలు ఈ అగస్త్యేశ్వరాలయాలు. సరైన ప్రచారానికి నోచుకోకుండా, జనబాహుళ్యంలో ఈ అరుదైన ఆలయాల గురించి చాల తక్కువ మందికి తెలుసు.
చరిత్ర ప్రకారంగా చూస్తే, వీటిని రేనాటి చోళుల కాలంలో (క్రీ. శ. 6-9 శతాబ్దాల కాలం) నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ యాత్రలో, తాను బస చేసిన ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టించారు అని కథనం.
అగస్త్య ప్రతిష్టితమైన ఈ శివలింగాలు భారీలింగ రూపంలో, స్థంభములాగా, తలపైన శిగతో, ప్రత్యేక ఆకారంలో ఉంటున్నాయి. గుడిమల్లం శివలింగం పోలికలు కలిగి ఉంటాయి. కింద చెప్పిన ఊర్లళ్ళో ఈ ఆలయాలు ఉన్నాయి.
చదిపిరాళ్ళ, కమలాపురం మండలం, రేనాటి చోళుల కాలం నాటిది.
చిలమకూరు, యఱ్ఱగుంట్ల మండలం. 8వ శతాబ్దంలో రెండవ విక్రమాదిత్యుని మహారాణి, గుడి పూజకి తోట దానం ఇచ్చినట్లు శాసనం ఉంది. గజపృష్టాకారంలో ఉండే ఇంకో గుడి. ఆలయ స్థంభాల మీద విష్ణు శిల్పాలు కూడా ఉన్నాయి.
పెద్దచెప్పలి, కమలాపురం మండలం. 6వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందని శాసనాలు లభ్యమవుతున్నాయి. గుడి, గజపృష్టాకారంలో ఉంటుంది. ఒకే ప్రాంగణంలో చెన్నకేశవాలయం కూడ ఉంది.
పోట్లదుర్తి (నడిగడ్డ శివాలయం), పాత గుడి, చరిత్ర అలభ్యం.
ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయం, 8వ శతాబ్దంలో నందిచోళుడు నిర్మించారు.
పెద్దశెట్టిపల్లె/నరసింహాపురం శివాలయం, శివలింగం అగస్త్యలింగాకృతిలోనే ఉన్నా, చరిత్ర అలభ్యం.
– సి పురుషోత్తం
(నరసింహపురం, వృత్తినిపుణులు)
EMail : purushotham.c@gmail.com