అందులోనూ వివక్షే!

    అందులోనూ వివక్షే!

    కడప జిల్లా పర్యాటక రంగానికి మరోసారి అన్యాయం జరిగింది. కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీవద్ యశో నారాయణ మంగళవారం పార్లమెంటులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యాటకాభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను లిఖిత పూర్వకంగా వివరించారు. మన రాష్ట్రానికి సాధారణ సర్క్యూట్ విభాగంలో పది ప్రాజెక్టులను కేటాయించారు. సాధరణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదికలకు అనుగుణంగా కేంద్రం ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తుంది..

    అందులో గుంటూరుకు మూడు కేటాయించి పశ్చిమ గోదావరికి రెండు, చిత్తూరు (శ్రీకాళహస్తి)కు ఒకటి ఇచ్చారు. నెల్లూరులో ఫ్లెమింగో ఉత్సవాలకు మరోమారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాయలసీమలో అనంతపురం లేపాక్షి ఉత్సవాలకు అనుమతి ఇచ్చారు.

    చదవండి :  యోవేవి ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ను తిట్టిన తెదేపా నేత?

    ఇందులో కడప జిల్లాకు మాత్రం ప్రాధాన్యత లభించలేదు. జిల్లాను విస్మరించడం పట్ల పర్యాటకాభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెదేపా ప్రాబల్యం గల ప్రాంతాలలో మాత్రమే పర్యాటక ప్రాజెక్టులు, ఉత్సవాలను మంజూరు చేసి మన జిల్లా మాత్రం ఈ రాష్ట్రంలోనిది కాదన్నట్లు పాలకులు ప్రవర్తించడం సరికాదేమో!

    కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ అక్కడికే పంపిస్తోంది..! ఇంతకీ మన జిల్లా తెదేపా నేతలు ఏం చేస్తున్నారు? మీడియా సమావేశాలు పెట్టటం తప్ప!

    చదవండి :  కడప జిల్లాలో సంక్రాంతి

    నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమయ్యారు?

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *