
అంచితపుణ్యులకై తే హరి దైవ మవుఁగాక – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అంచితపుణ్యులకై తే హరి దైవ మవుఁగాక పంచమహపాతకులభ్రమ వాప వశమా ॥చ1॥ కాననియజ్ఞానులకు కర్మమే దైవము ఆనినబద్ధులకు దేహమే దైవము మాపననికాముకులకు మగువలే దైవము పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా ॥చ2॥ యేమీ నెఱఁగనివారి కింద్రియములు దైవము దోమటిసంసారి కూరదొర దైవము తామసుల కెల్లాను ధనమే దైవము పామరుల బట్టినట్టి భ్రమఁ బాపవశమా ॥చ3॥ ధర నహంకారులకు తాఁదానే దైవము దరిద్రుఁడైనవారికి దాత దైవము యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము పరులముంచినయట్టి భ్రమఁ బాపవశవమా |
రాగము: దేసాక్షి రేకు: 0099-04 సంపుటము: 1-498 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాక్షి