సహజ వైష్ణవాచార వర్తనుల-

॥పల్లవి॥
సహజ వైష్ణవాచార వర్తనుల-
సహవాసమె మాసంధ్య
euthyrox 150
euthyrox 88
mebendazol dosierung
mebendazol overdosering
॥చ1॥
అతిశయమగు శ్రీహరిసంకీర్తన
సతతంబును మాసంధ్య
మతి రామానుజమతమే మాకును
చతురతమెఱసిన సంధ్య
॥చ2॥
పరమభాగవతపదసేవనమే
సరవి నెన్న మాసంధ్య
సిరివరుమహిమలు చెలువొందఁగ వే-
సరక వినుటె మాసంధ్య
॥చ3॥
మంతుకెక్క తిరుమంత్రపఠనమే
సంతతమును మాసంధ్య
కంతుగురుఁడు వేంకటగిరిరాయని-
సంతర్పణమే మాసంధ్య
రాగము: సామంతం
రేకు: 0002-04
సంపుటము: 1-10

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం

చదవండి :  ఒంటిమిట్ట కోదండరాముని సన్నిధిలో అన్నమయ్య రాసిన సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *