సహజాచారములెల్లా సర్వేశ్వరునియాజ్ఞే – అన్నమయ్య సంకీర్తన

సహజాచారములెల్లా సర్వేశ్వరునియాజ్ఞే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సహజాచారములెల్లా సర్వేశ్వరునియాజ్ఞే
అహమించి నమ్మకుండు టదియే పాషండము
॥చ1॥
నిద్దిరించువానిచేతి నిమ్మవంటివలెనే
చద్దికర్మములు తానే జారితే జారె
పొద్దువొద్దు తనలోన భోగకాంక్ష లుండఁగాను
అద్దలించి కర్మ మొల్లననుటే పాషండము
॥చ2॥
కలగన్నవాడు మేలుకనినటువలెనే
తలగి ప్రపంచ మెందో దాఁగితే దాగె
యిల నీదేహము మోఁచి యింతా గల్లలనుచు
పలికి తప్పనడచే భావమే పాషండము
॥చ3॥
ధర నద్దము చూచేటి తనరూపమువలె
గరిమతో దనయాత్మ కంటేఁ గనె
సరుస శ్రీవేంకటేశుసాకార మటు గని
కరఁగి భజించలేని కష్టమే పాషండము
రాగము: మలహరి
రేకు: 0088-03
సంపుటము: 1-431

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరి

చదవండి :  అంతర్యామీ అలసితి సొలసితి - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: