
సతతవిరక్తుఁడు సంసారి గాఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సతతవిరక్తుఁడు సంసారి గాఁడు రతిసమ్మదుఁడు విరక్తుఁడు నితఁడె ॥చ1॥ నిత్యుఁడైనవాఁడు నిఖిలలోకములఁ- బ్రత్యక్షవిభవ సంపన్నుఁడు గాఁడు నిత్యుఁడు నితఁడే నిరుపమానుఁడైన ప్రత్యక్షవిభవ సంపన్నుఁ డితఁడె ॥చ2॥ యోగియైనవాఁడు వొనర నేకాలము భోగియై భోగిపై భోగింపలేఁడు యోగియు నితఁడే వుడుగక భోగిపై భోగించునటువంటి పురుషుండు నితఁడె ॥చ3॥ దేవుడైనవాఁడుఁ దెలుప లోకముల దేవతారాధ్యుఁడై దీపింపలేఁడు దేవుఁడు నితఁడే దివిజవంద్యుఁడైన శ్రీవేంకటగిరిదేవుండితఁడె |
రాగము: కన్నడగౌళ రేకు: 0044-05 సంపుటము: 1-272 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ