
సంసారినై ననాకు సహజమే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సంసారినై ననాకు సహజమే కంసారి నే నిందుకెల్లా గాదని వగవను ॥చ1॥ నరుఁడనైననాకు నానాసుఖదుఃఖములు సరి ననుభవించేది సహజమే హరిని శరణాగతులైనమీఁద బరాభవ- మరయ నిన్నంటునని అందుకే లోగేను ॥చ2॥ పుట్టిననాకు గర్మపు పొంగుకు లోనైనవాఁడ జట్టిగాఁ గట్టువడుట సహజమే యిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాట పట్టు వోయీనోయని పంకించే నే నిపుడు ॥చ3॥ మాయకులోనైననాకు మత్తుఁడనై యిన్నాళ్లు చాయకు రానిదెల్లా సహజమే యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు మోయరానినేను నీకు మోపని వీఁగేను |
రాగము: గుజ్జరి రేకు: 0098-03 సంపుటము: 1-491 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుజ్జరి