
శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి దమము చాలనియట్టితగు లిదేమిటికి ॥చ1॥ పగయునుఁబోలె నాపై సేయునడియాస తగిలి యేపనేకాని దయ గొంత లేదు జగడముఁబోలె నలసతిలేనిమమత దను తెగి వేఁచనేకాని తీరుగడ లేదు ॥చ2॥ ఋణమునుఁబోలె తీరియుఁదీరనది కర్మ గణనగలకాలంబు కడ మొదలు లేదు వ్రణమునుఁబోలె విడవక రాఁగ దేహజపు- గుణము సౌఖ్యము తెరువు గొంతయును లేదు ॥చ3॥ నీతియుఁబోలెఁ బ్రాణికి వేంకటేశుకృప చేతికి నిధానంబు చేరినట్లాయ భూతములఁబోలె తలఁపున కితరసంస్మరణ- భీతిపుట్టించి యప్రియభావమాయ |
రాగము: కాంబోది రేకు: 0050-04 సంపుటము: 1-307 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కాంబోది