వైష్ణవులుగానివార లెవ్వరు లేరు
॥పల్లవి॥ వైష్ణవులుగానివార లెవ్వరు లేరు విష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గాన euthyrox 150 euthyrox 88 ॥చ1॥ అంతయు విష్ణు మయం బట మరి దేవ- తాంతరములు గలవననేలా భ్రాంతిఁ బొంది యీ భావము భావించి- నంతనే పుణ్యులవుట దప్పదుగాన ॥చ2॥ యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరి యెవ్వరిఁ దలచిన నేమి అవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా- రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు ॥చ3॥ అతిచంచలంబైన యాతుమ గలిగించు- కతమున బహుచిత్తగతులై యితరులఁ గొలిచిన యెడయక యనాథ- పతితిరువేంకటపతి చేకొనుఁగాక |
రాగము: ధన్నాసి రేకు: 0006-01 సంపుటము: 1-36 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాసి