వేదవేద్యులు వెదకేటిమందు
॥పల్లవి॥ వేదవేద్యులు వెదకేటిమందు అదినంత్యములేని ఆమందు ॥చ1॥ అడవిమందులుఁ గషాయములు నెల్లవారు కడగానక కొనఁగాను తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి- నడియాలమైనట్టి ఆమందు ॥చ2॥ లలితరసములుఁ దైలములు నెల్లవారు కలకాలము గొనఁగాను చెలువైన దొకమందు చేరె మాకు భువి- నలవిమీఱినయట్టియామందు ॥చ3॥ కదిసినజన్మరోగముల నెల్లవారు కదలలేక వుండఁగాను అదన శ్రీతిరువేంకటాద్రిమీఁదిమందు అదివో మాగురుఁడిచ్చె నామందు |
రాగము: దేసాక్షి రేకు: 0001-02 సంపుటము: 1-2 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షి