కడపలో హీరో వెంకటేష్
కడప: తెలుగు సినిమా రంగంలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన వెంకటేశ్ శుక్రవారం నగరంలోని పెద్దదర్గా(అమీన్ పీర్ దర్గా)ను దర్శించుకున్నారు. అమీర్‌బాబుతో కలిసి వచ్చిన ఆయన దర్గాలోని గురువుల మజార్ల వద్ద పూలచాదర్ సమర్పించి గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. దర్గా ప్రతినిధి అమీన్ వెంకటేష్ కు దర్గా ప్రాశస్త్యాన్ని వివరించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో దర్గాను దర్శించుకోవాలనుకున్నానని, ఆ కోరిక నేటికి తీరడం సంతోషదాయకమన్నారు. వెంకటేశ్‌ను చూసేందుకు మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు.