
వీఁడివో యిదె వింతదొంగ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ వీఁడివో యిదె వింతదొంగ వేఁడిపాలు వెన్న వెరఁజినదొంగ ॥చ1॥ వెలయ నీటఁ జొప్పువేనేటి దొంగ తలగాననీక దాఁగు దొంగ తలఁకక నేలదవ్వేటిదొంగ తెలసి సందెకాడఁ దిరిగేటి దొంగ ॥చ2॥ అడుగుకింద లోకమడఁచేటి దొంగ అడరి తల్లికినైన నలుగుదొంగ అడవిలో నెలవైయున్న దొంగ తొడరి నీలికానెతో నుండు దొంగ ॥చ3॥ మోస మింతుఁల జేయుముని ముచ్చుదొంగ రాసికెక్కిన గుఱ్ఱంపు దొంగ వేసాల కిటు వచ్చి వేంకటగిరిమీఁద మూసినముత్యమై ముదమందు దొంగ |
రాగము: భైరవి రేకు: 0063-01 సంపుటము: 1-322 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవి