వననిధిఁ గురిసిన వానలివి మతి- – అన్నమయ్య సంకీర్తన

వననిధిఁ గురిసిన వానలివి మతి- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
వననిధిఁ గురిసిన వానలివి మతి-
పనిలేని పనుల భారములు
॥చ1॥
అడవుల వెన్నెల లారిడి బదుకులు
తడతాఁకుల పరితాఁపములు
వొడలొసఁగిన హరి నొల్లక యితరుల
బడి బడిఁ దిరిగిన బంధములు
॥చ2॥
కొండల నునుపులు కొనకొన మమతలు
అండలఁ కేగిన నదవదలు
పండిన పంటలు పరమాత్ము విడిచి
బండయి తిరిగిన బడలికలు
॥చ3॥
బచ్చన రూపులు పచ్చల కొలపులు
నిచ్చలనిచ్చల నెయ్యములు
రచ్చల వేంకటరమణునిఁ గొలువక
చచ్చియుఁ జావని జన్మములు
రాగము: ఆహిరి
రేకు: 0004-04
సంపుటము: 1-24

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి

చదవండి :  ఎన్నఁడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: